మనుబోలు మండలంలో పర్యటించిన కాకాణి గోవర్ధన్
NLR: మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి శుక్రవారం మనుబోలు మండలం, మడమనూరు, చెర్లోపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతి అలుముకుందని ఆరోపించారు. యూరియా సరఫరా సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.