రైతులకు న్యాయం జరిగేలా చూడాలి: MLA
KKD: మొంథా తుపాను కారణంగా పెద్దాపురంలో జరిగిన నష్టంపై RDO కార్యాలయంలో MLA నిమ్మకాయల చినరాజప్ప గురువారం సమీక్ష నిర్వహించారు. పంట పొలాల నష్టంపై రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేలా చూడాలన్నారు. తుఫాను నష్టంపై వెంటనే ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలొ ఆర్డీవో శ్రీ రమణి,రామారావు, శ్రీరాములు, తహశీల్దార్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు.