బర్త్ సర్టిఫికేట్‌కు బదులు.. డెత్ సర్టిఫికెట్ జారీ

KMM: చిన్నారి బర్త్ సర్టిఫికట్‌కు దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన కూసుమంచి మండలంలో చోటు చేసుకుంది. గట్టుసింగారంకి చెందిన మాదవిద్య అనే చిన్నారి పెరెంట్స్ బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా డెత్ సర్టిఫికెట్ ఇచ్చారు. తరువాత అధికారులు తేరుకొని చించేసి, తప్పుడు వివరాలతో మళ్లీ బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడం చర్చనీయాంశమైంది.