ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

విశాఖలోని దొండపర్తిలోని శ్రీ ఎరుకుమాంబ ఆలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోగా, ఏకాహం భక్తి శ్రద్ధలతో కొనసాగింది.