ఉద్యోగులకు బెదిరింపులు.. కేసు నమోదు

ఉద్యోగులకు బెదిరింపులు.. కేసు నమోదు

KNR: ఇల్లందకుంట మండల MRO కార్యాలయంలో మే 3న సీనియర్ అసిస్టెంట్ వేముగంటి అనిల్ కుమార్, అటెండర్ గోస్కుల రాకేష్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో గట్టు సాయిరాం, పసునూతి శివ అనే ఇద్దరు వచ్చి వారిపై బెదిరింపులకు దిగి దూషణలు చేసి పనికి ఆటంకం కలిగించారు. అనంతరం ఆగస్టు 5న మళ్లీ వచ్చి దుర్భాషలాడినట్లు బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.