శ్రీనివాస కాలనీలో వివాహిత ఆత్మహత్య
సూర్యాపేట పట్టణంలోని శ్రీనివాస కాలనీకి చెందిన బత్తుల లక్ష్మి (34) ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లి పోలీసులకు ఈరోజు ఫిర్యాదు చేశారు. భర్త వీరాబాబు ఉద్యోగరీత్యా కెనడాలో ఉండగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ వెంకట్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ శివతేజ్ కేసు నమోదు చేస్తున్నారు.