సోమశిల జలాశయంలో 50టీఎంసీల నీరు నిల్వ

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటల నాటికి 50.673 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమశిల జలాశయంలో 272 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. పెన్నా డెల్టాకు 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి ఎటువంటి నీరు రావడం లేదు.