VIDEO: విద్యుత్ వైర్ల నుంచి చెలరేగిన మంటలు

కోనసీమ: రాజోలు మండలం పాలగుమ్మిలో బుధవారం విద్యుత్ తీగలు ఒకదానికొకటి తాకి మంటలు చెలరేగాయి. భారీ వర్షం కురుస్తుండడంతో వైర్‌లు తెగిపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెట్ల మధ్య నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు చెప్తున్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.