'నిరుద్యోగులకు ఉపాధి అవకాశం'
CTR: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నట్లు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ తెలిపారు. చిత్తూరు మండలంలోని వెంకటాపురం నూతనంగా ఏర్పాటు చేస్తున్న MSE-CDPకి వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుందని చెప్పారు.