వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష

TG: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్నవారిని ఖాళీ చేయించాలని తెలిపారు. కాజ్‌వేలు, కల్వర్టుల దగ్గర అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.