డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

NLG: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఒక వ్యక్తికి నల్గొండ న్యాయస్థానం ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన చింతల నాగయ్య మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేయగా కోర్టు నేడు తీర్పు ఇచ్చినట్లు కనగల్ పోలీసులు తెలిపారు.