జనగణన ప్రక్రియను పరిశీలిస్తున్న కమిషనర్
ATP: జనగణన 2027 ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ లక్ష్మిదేవి పిలుపునిచ్చారు. గుంతకల్లు హనుమేష్ నగర్ నందు జనగణన నమోదు ప్రక్రియను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఈ నెల 30వ తేదీ వరకూ ప్రజలే స్వయంగా అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఇళ్ల వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు.