ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
NDL: కొలిమిగుండ్ల గ్రామంలో ఇవాళ దాసరి సీతారామయ్య అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాసరి సీతారామయ్య గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండేవాడు. జీవితంపై విరక్తి చెంది తన ఇంటిలోని ఇనుప రాడుకి తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.