పెదకాకాని సీఐగా నారాయణస్వామి బాధ్యతలు

పెదకాకాని సీఐగా నారాయణస్వామి బాధ్యతలు

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పరిధి పెదకాకాని పోలీస్ స్టేషన్ సీఐగా టీపీ నారాయణస్వామి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సీఐగా విధులు నిర్వహిస్తున్న వీరస్వామి విఆర్‌కు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో కారంపూడిలో సీఐగా విధులు నిర్వహిస్తున్న నారాయణస్వామిని నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన సెబ్ సీఐగా గుంటూరులో పనిచేశారు.