పిల్లలను అపహరించిన గుర్తుతెలియని మహిళ
E.G: రాజమహేంద్రవరం వీఎల్.పురం అపార్ట్‌మెంట్ బయట పాప మోహన శ్రీ, బాబు భాను ప్రసాద్(7) ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక గుర్తు తెలియని మహిళ ఇవాళ సాయంత్రం తీసుకెళ్ళిపోయినట్లు స్థానికులు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరికైనా ఆచూకీ తెలిసిన 9440796533 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.