అలరించిన చిన్నారుల వేషధారణ

E.G: కొవ్వూరు భాష్యం పాఠశాలలో ఇవాళ కృష్ణాష్టమి వేడుకలను పాఠశాల హెచ్ఎం కోటేశ్వరీ దేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఉట్టి కొట్టించారు. అనంతరం భక్తి పాటలు, నృత్యాలు ప్రదర్శించారు. కాగా చిన్నారుల గోపిక, కృష్ణుడు అలంకరణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.