'నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి'
KDP: ప్రభుత్వ నిబంధనలు పాటించని నారాయణ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని SFI జిల్లా అధ్యక్షుడు జాల సుమంత్ డిమాండ్ చేశారు. వేసవికాలంలో ఒంటిపూట బడులు అమల్లో ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు సాయంత్రం వరకు తరగతులు నిర్వహించడం తప్పు అని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ విధానాన్ని ఖండించారు.