మహబూబ్ నాగర్ నుంచి అరుణాచలానికి స్పెషల్ బస్
MBNR: మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని అరుణాచలం గిరి ప్రదక్షిణకు MBNR డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్ DEC 3న రాత్రి 7గం.కు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సుజాత తెలిపారు. 4న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, 5న అరుణాచలం చేరుకొని మరుసటి రోజు గిరిప్రదక్షిణ, 6న MBNRకు చేరుకుంటుందన్నారు. ఛార్జీలు పెద్దలకు రూ.3,600, పిల్లలకు: రూ.2400 టికెట్ ధర ఉందన్నారు.