టీవీ అవార్డ్స్ 2024.. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం 'టెలివిజన్ అవార్డ్స్ 2024'ను అందజేయనుంది. ఈ అవార్డుల విజేతలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యుల ఈ కమిటీకి TGFDC MD కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. అలాగే, ప్రముఖ నిర్మాత శరత్ మరార్‌ను ఈ కమిటీకి ఛైర్మన్‌గా నియమించారు. కె. బాపినీడు, మంజుల నాయుడు, పి. కిరణ్ వంటి ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.