'హీరోయిన్ పాత్ర కోసం 1300 మందిని ఆడిషన్ చేసాం'

'హీరోయిన్ పాత్ర కోసం 1300 మందిని ఆడిషన్ చేసాం'

'ధురంధర్ 2'లో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా సారా అర్జున్‌ను ఎంపిక చేయడంపై కాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ ఛాబ్రా ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రణ్‌వీర్‌తో గతంలో నటించిన వారు కాకుండా, కొత్త ముఖం ఉండాలన్న ఉద్దేశంతో 1300 మందిని ఆడిషన్ చేసి సారాను ఎంచుకున్నట్లు తెలిపాడు. ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకే దర్శకుడు ఆదిత్య ధర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు.