లారీ ఢీకొని వ్యక్తి మృతి
MNCL: జన్నారం మండలంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో బైక్‌ని లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు సింగరాయపేట గ్రామానికి చెందిన ఆడాయి మారుతి( 25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బైకు వెనుక కూర్చున్న గంగాధర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.