బీ ఫార్మసీ ఫలితాలు విడుదల

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం బీ ఫార్మసీ 8వ సెమిస్టర్ రెగ్యులర్ అలాగే, 1, 3, 5, 7 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎన్.శ్రీనివాస్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కె.ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.