VIDEO: గ్యాస్ కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్
KMR: పిట్లంలో వంట గ్యాస్ కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఉదయం నుంచే హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద సిలిండర్ల కోసం ప్రజలు భారీగా బారులు తీరారు. సరఫరాలో జాప్యం జరగడంతో క్యూలైన్లు కిలోమీటర్ల మేర కనిపించాయి. కొరత మరింత పెరుగుతుందన్న ఆందోళనతో వినియోగదారులు గంటల తరబడి వేచి ఉన్నారు.