ఆ పాట పాడింది మన జిల్లావాసే
JGL: ఇటీవల విడుదలైన 'బాయిలోన బల్లి పలికే' సాంగ్ యూట్యూబ్‌లో మూడు రోజుల్లోనే 56 లక్షల వ్యూస్ సాధించి ట్రెండ్‌లో ఉంది. అయితే, ఈ పాటలో సింగర్ మంగ్లీతో గొంతు కలిపిన మరొకరు మన జిల్లా వాసే. ఆమె ఎవరో కాదు గుల్లకోటకు చెందిన జానపద కళాకారిణి చుంచు నాగవ్వ. చదువు రాకపోయినా పల్లె పదాలు, జానపదాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె పాడిన 'మోహనలాలీ', 'తిరుపతిరెడ్డి' పాటలు సుపరిచితమే.