నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: కోలనపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం పనుల దృష్ట్యా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని విద్యుత్ శాఖ ఈఈ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. టీ అండ్ డీ పనుల్లో భాగంగా నూతన విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడుతున్నందున, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోలనపల్లి గ్రామం, స్థానిక చెరువులకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.