లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం !

లక్షల్లో జీతం.. లంచాలే నేస్తం !

SDPT: ఉమ్మడి జిల్లాలో కొందరు అధికారుల అవినీతి తీరు ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. గత నవంబర్‌లో ములుగు, టేక్మల్ ఎస్సైలు లంచం తీసుకుంటూ పట్టుబడగా, తాజాగా గజ్వేల్ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సుమారు రూ. 4 కోట్ల అక్రమాస్తులు బయటపడటంతో శాఖల్లో చర్చనీయాంశమైంది. లక్షల్లో జీతాలు పొందుతున్నా, ప్రజల రక్తం పిలుస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.