ALERT: భారీ వర్షాలు.. జాగ్రత్త
AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.