ఆవిష్కరణ కాకముందే కనుమరుగు కానున్న అమరవీరుల స్థూపం

HNK: తెలంగాణ ఉద్యమంలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి ప్రత్యేక స్థానం ఉంది. సబ్బండ వర్గాల సహకారంతో ముల్కనూరులో రాష్ట్రంలో రెండవ అతిపెద్ద అమరవీల స్థూపాన్ని నిర్మించుకున్నారు. ఈ క్రమంలో మెదక్ నుండి ఎల్కతుర్తి వరకు నిర్మితమవుతున్న జాతీయ రహదారి పనుల వెడల్పు వల్ల అమరవీట్ట స్థూపం కనుమరుగు అవుతుందని అనుమానాన్ని ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్నారు.