చెరువులు నింపాలని నిలదీస్తే..

చెరువులు నింపాలని నిలదీస్తే..

NLG: ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆలేరు మండలం కొలనుపాకలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ఐలయ్య వచ్చారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన రైతు అంజయ్య.. గ్రామాల్లో చెరువులు నింపి రైతులను ఆదుకోవాలంటూ MLA ను నిలదీశారు. దాంతో MLA స్పందిస్తూ ‘నువ్వే ఉన్నావా అడగడానికి పీకుడుగాడివి’ అని అన్నారు.