భద్రాద్రి జిల్లాలో దంచి కొట్టిన ఎండలు

భద్రాద్రి జిల్లాలో దంచి కొట్టిన ఎండలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం ఎండలు దంచికొట్టాయి. చర్ల మండలం సత్యనారాయణపురంలో అత్యధికంగా 42.5°C, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 42.3°C, పినపాక మండలం ఈ బయ్యారంలో 42.3°C, మణుగూరు జీఎం ఆఫీస్ వద్ద 42.2°C నమోదయ్యాయి. జిల్లాలో 20 ప్రాంతాల్లో 40°C దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.