జలపాతాలలో యువత సందడి

ASF: బెజ్జూరు మండలంలోని సమ్మక్క గుట్ట వద్ద జలపాత అందాలను చూసేందుకు యువత పెద్ద ఎత్తున తరలి వెళ్లి సందడి చేస్తున్నారు. పర్యటకులకు జలపాత అందాలు కనువిందు చేస్తున్నాయి. గుట్ట నుండి జారుతున్న జలపాతం అందాలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. యువత పెద్ద ఎత్తున తరలివెల్లి జలపాతాలలో సందడి చేస్తున్నారు.