VIDEO: రేషన్ అందలేదని ఎమ్మెల్యేకు వినతి

VIDEO: రేషన్ అందలేదని ఎమ్మెల్యేకు వినతి

NLR: అమ్మా మేము కోవూరు (M) పడుగుపాడులో ఉంటున్నాం. మాకు రేషన్ బియ్యం అందడం లేదు. డీలర్ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. మీరైనా స్పందించి న్యాయం చేయండి' అంటూ పలువురు మహిళలు, గ్రామస్థులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎదుట వాపోయారు. దీనిపై స్పందించిన ఆమె సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను తెలుసుకొని పరిష్కరిస్తామని తెలిపారు.