మరికాసేపట్లో నల్లబొమ్మినిపల్లికి మంత్రి రాక

ATP: చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లి గ్యాంగ్ రేప్ బాధితులను ఆదివారం మధ్యాహ్నం మంత్రి ఎస్.సవిత పరామర్శించనున్నారు. అమరావతి నుంచి బెంగుళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బాధితుల ఇంటికి వెళ్లనున్నారు. ఇప్పటికే ఎస్పీతో మంత్రి మాట్లాడి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.