ధాన్యాన్ని 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలి: కలెక్టర్

JGL: కొనుగోలు కేంద్రాల్లో నాణ్యమైన దాన్యాన్ని 24 గంటల్లో రైస్ మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కోరుట్ల మండలం యేకిన్ పూర్ పిఏసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జివాకర్ రెడ్డి, డిఆర్డీఓ రఘువరన్, డిసిఓ మనోజ్ కుమార్, మండల ఎమ్మార్వో ఉన్నారు.