జిల్లా న్యాయ మూర్తిని కలిసిన ఎస్పీ
MLG: జిల్లా న్యాయమూర్తి సూర్య చంద్ర కళను ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాధ్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం, కేసుల త్వరితగతిన పరిష్కారానికి అవసరమైన సహకారం వంటి అంశాలపై పరస్పరంగా చర్చించారు. జిల్లా శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడంలో పరస్పర సహకారం కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.