VIDEO: వెలగని వీధి దీపాలు.. వాహనదారుల అవస్థలు
MBNR: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్ నుంచి క్రిస్టియన్‌పల్లి వరకు వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నవి కూడా మినుకుమినుకుమంటూ వెలుగుతుండటంతో రాత్రివేళ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే లైట్లను మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.