నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

NLG: శాలిగౌరారం మండలంలో ఈ నెల 18 నుంచి మే 12 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు మండల పశు వైద్యాధికారి శరణ్య తెలిపారు. పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ముందస్తు చర్యల్లో భాగంగా టీకాలు వేసేందుకు గ్రామాల వారీగా షెడ్యూల్ చేశామన్నారు. పశుపోషకులు వారి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని తెలిపారు.