రేపు పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం

KMM: రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ.. పాలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.