VIDEO: సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న కేటీఆర్
SRCL: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని హనుమాన్ ఆలయంలో సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్త ప్రసాదాలు స్వీకరించి, భక్తులతో మమేకమై కళ్యాణ మహోత్సవంపై మాట్లాడారు.