జూద శిబిరంపై దాడి.. 12 మంది అరెస్ట్

జూద శిబిరంపై దాడి.. 12 మంది అరెస్ట్

BPT: ఇంకొల్లు మండలం భీమవరం సమీపంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో నిన్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై సురేష్ బృందం అక్కడికి చేరుకుని 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.79,500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్సై వెల్లడించారు.