తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

GNTR: ఎగువ నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్, ఔట్ ఫ్లో 4,71,263 క్యూసెక్కులుగా ఉంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.