'అలైవ్ - అరైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

'అలైవ్ - అరైవ్' రోడ్డు భద్రత కార్యక్రమం

PDPL: రామగిరి మండలం జల్లారం, లద్నాపూర్ గ్రామపంచాయతీల్లో ప్రజా పాలనా-ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో 'అలైవ్-అరైవ్' కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీసీపీ రాంరెడ్డి, ఏసీపీ రమేష్, ఎంపీడీవో శైలజరాణి, సీఐ GDK 2 టౌన్ పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనదారులు పాటించాల్సిన నియమాలు వివరించారు.