ప్రమాదాల నివారణకు గ్రామస్థుల ముందడుగు

ప్రమాదాల నివారణకు గ్రామస్థుల ముందడుగు

MDK: నిజాంపేట మండలం నందగోకూల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో నోఎంట్రీ - నో హెల్మెట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ప్రాణ రక్షణ ద్యేయంగా గ్రామస్తులు చేసిన ఆలోచన బాగుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు.