రేజేరు శివారులో రోడ్డు పక్కనే చెత్త

VZM: బాడంగి మండలం రేజేరు శివారులో రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో చెత్త సేకరణ సక్రమంగా చేయకపోవడం వలనే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. రోడ్డు పక్కన చెత్త ఉండడంతో గాలి వీస్తే కళ్లలోకి పడుతుందని వాహనదారులు తెలిపారు. ఇంటింటి చెత్త సేకరించాలని స్థానికులు కోరుతున్నారు.