అధికారులమంటూ రూ.92 లక్షలు కాజేశారు!

అధికారులమంటూ రూ.92 లక్షలు కాజేశారు!

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన డిజిటల్ అరెస్ట్ మోసం తాజాగా వెలుగు చూసింది. CBI, ED అధికారులమంటూ ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమె పేరుందని, పాస్‌పోర్ట్ బ్లాక్ చేస్తామని బెదిరిస్తూ ఏకంగా రూ.92.7 లక్షలు కాజేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కర్ణాటకకు చెందిన లింగబలిజ విరూపాక్ష అనే నిందితుడిని అరెస్ట్ చేశారు.