సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

సెప్టెంబర్ 1 నుండి డిగ్రీ తరగతులు ప్రారంభం!

SKLM: ఎట్టకేలకు డిగ్రీ ఫస్టియర్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 20 నుండి 26 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ కొరకు 24 నుండి 28 వరకు, సీట్ల కేటాయింపు 31వ తేదీన ఉంటుంది. సెప్టెంబర్ 1 నుండి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జిల్లాలో ఉన్న 15 ప్రభుత్వ, 74 ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు రావడంతో ప్రవేశాలపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.