VIDEO: 'బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది'
SKLM: అసెంబ్లీ కమ్యూనిటీ హాల్లో జరిగిన బీసీ సంక్షేమ సమావేశంలో గురువారం నరసన్నపేట MLA రమణమూర్తి పాల్గొన్నారు. బీసీ వర్గాలలో ఇంకా అనేక సమూహాలు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని ఆయన అన్నారు. మత్స్యకారులు, చెంచులు వంటి వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.