ఛైర్మన్ ఎన్నికను ప్రభుత్వం అడ్డుకుంటుంది: జోగు రామన్న
ADB: ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అక్రమ అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశమై మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సరైనది కాదని హెచ్చరించారు.