'జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి'

HYD: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో యూసఫ్‌గూడ డివిజన్ బూత్ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గోపీనాథ్ నాయకత్వంలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయని ఆమె పేర్కొన్నారు.