ఉదయనిధి, టీవీకే విజయ్ నామినేషన్ దాఖలు
తమిళనాడు ఎన్నికల‍్లో చెపాక్-తిరువల్లికేని అసెంబ్లీ నుంచి డీఎంకే అభ్యర్థి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, టీవీకే అధ్యక్షుడు, హీరో విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.